- BIKKI NEWS : 17-01-2026
NEW INCOME TAX SLABS AND DEDUCTIONS. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పుతిన్ పన్ను విధానం చాలా సరళమైనది కానీ ఇందులో ఎక్కువ మినహాయింపులు ఉండవు.
NEW INCOME TAX SLABS AND DEDUCTIONS.
పన్ను రేట్లు (Tax Slabs):
రూ. 4 లక్షల వరకు: నిల్ (పన్ను లేదు)
రూ. 4 లక్షల నుండి 8 లక్షల వరకు: 5%
రూ. 8 లక్షల నుండి 12 లక్షల వరకు: 10%
రూ. 12 లక్షల నుండి 16 లక్షల వరకు: 15%
రూ. 16 లక్షల నుండి 20 లక్షల వరకు: 20%
రూ. 20 లక్షల నుండి 24 లక్షల వరకు: 25%
రూ. 24 లక్షల పైన: 30%
ముఖ్యమైన విషయాలు
స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction): రూ. 75,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
పన్ను రాయితీ (Rebate u/s 87A): పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం
(Taxable Income) రూ. 12,00,000 మించకపోతే, రూ. 60,000 వరకు పన్ను రాయితీ లభిస్తుంది.
అనగా 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
మినహాయింపులు :
- స్టాండర్డ్ డిడక్షన్ (75,000/-),
- ఎన్.పి.ఎస్ (NPS) లో యజమాని వాటా (Employer Contribution),
- 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 60,000/- మినహాయింపు.
- అగ్నివీర్ కార్పస్ ఫండ్ (80CCH) వంటివి
- గృహ రుణ వడ్డీ (రెంట్ కి ఉంటే)
- ఇతర అనుమతి , అర్హత గల ఆదాయం (80JJAA)
మినహాయింపు లేనివి :
- ఇంటి అద్దె భత్యం (HRA),
- గృహ రుణ వడ్డీ (Self-occupied),
- సెక్షన్ 80C & 80 D (LIC, PF, School fee, Health Insurance వంటివి) మినహాయింపులు ఇందులో ఉండవు.


Comments are closed.