BIKKI NEWS (DEC. 24) : All GOs must upload in public domains says high court. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అన్ని ఉత్తర్వులు (జీవోలు), నోటిఫికేషన్లు, నిబంధనలు, సర్క్యులర్లను తక్షణం ఆయా శాఖల అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
All GOs must upload in public domains says high court.
జీవోలను, సర్క్యులర్లను అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2023 డిసెంబరు నుంచి 2025 జనవరి దాకా 19,064 జీవోలు జారీచేయగా కేవలం 3,290 మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 15,774 జీవోలు కనిపించడం లేదన్నారు.
వాదనలను విన్న న్యాయమూర్తి 2022లో డివిజన్ బెంచ్ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని, తక్షణం జీవోలను, ఇతర సర్క్యులర్లను అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
