Earth sciences university - ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం - bikki news

Earth Sciences University – ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం

BIKKI NEWS (DEC. 02) : దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి (Dr Manmohan Singh Earth Sciences University of Telangana) పేరు పెట్టారు.

Dr Manmohan Singh Earth Sciences University of Telangana

కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కిందట తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొట్టమొదటగా పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతంలోనే పునాది పడిందన్న విషయాలను గుర్తుచేశారు. తెలంగాణ ఆకాంక్షను ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నెరవేర్చిన నేపథ్యంలో యూనివర్సిటీకి వారి పేరు పెట్టినట్టు వివరించారు.

దేశాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా నడిపించిన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారని ప్రశంసించారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం విద్య, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అపారమైన ఖనిజ సంపదను గుర్తించడంతో పాటు సింగరేణి లాంటి పేరొందిన సంస్థలున్న ప్రాంతంలో ఖనిజ సంపదను గుర్తించడంతో పాటు పరిశోధన కోసం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ (DrMMSESUT) ను ఇక్కడ నెలకొల్పామని చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈ జిల్లాను అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో విద్య, నీటి పారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →