Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 15

Today in history - చరిత్రలో ఈరోజు నవంబర్ 15 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 15

Today in history November 15th

దినోత్సవం

  • ఝార్ఖండ్ ఫౌండేషన్ డే

సంఘటనలు

1937: కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
1954: టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు)
1954: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
1993: ఇండియన్ ఎయిర్‌లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
2000: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
2000: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.

జననాలు

1738: విలియం హెర్షెల్, వరుణ (యురేనస్‌) గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త. (మ.1822)
1883: ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (మ.1939)
1898: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (మ.1992)
1902: గోరా, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (మ.1975)
1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు సాహితీవేత్త.
1935: తెన్నేటి హేమలత, నవలా రచయిత్రి.
1949: మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలుగు రచయిత.
1958: దార్ల రామచంద్రం, కథా రచయత (మ. 2024)
1986: సానియా మీర్జా, భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.

మరణాలు

1630: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (జ.1571)
1949: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (జ.1910)
1949: నారాయణ్ ఆప్తే, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు.
1982: వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1895)
2012: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)
2022: ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1943)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →