Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 18

Today in history - చరిత్రలో ఈరోజు అక్టోబర్ 18 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 18

Today in history October 18th

దినోత్సవం

  • ప్రపంచ గాన దినోత్సవం (అక్టోబర్ మూడవ శనివారం)

సంఘటనలు

1922: ‘బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ’ (బీబీసీ) ప్రారంభం. కాలక్రమంలో అది ‘బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌’గా మారింది.
1954: ‘టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ సంస్థ ట్రాన్సిస్టర్‌రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది.
1992: వందలాది పోలీసుల పదఘట్టనలతో మారుమోగిన అమృత్‌సర్‌స్వర్ణదేవాలయం.
2004: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసారు.
2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర, తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారు.

జననాలు

1867: వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (మ.1949)
1900: చిలకపాటి సీతాంబ, రచయిత్రి, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.
1925: నారాయణదత్ తివారీ, భారత జాతీయ కాంగ్రెసు రాజకీయ నాయకుడు (మ.2018).
1925: ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) మాజీ డైరెక్టర్ (మ.2020)
1928: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత (మ.2013).
1936: యాతగిరి శ్రీరామ నరసింహారావు, చారిత్రక పరిశోధకుడు.
1949: ఎలిజబెత్ కురియన్ మోనా, హైదరాబాద్‌కు చెందిన ఉర్దూ గజల్ కవయిత్రి.
1956: మార్టినా నవ్రతిలోవా, మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.
1965: నరేంద్ర హిర్వాణి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1978: జ్యోతిక, దక్షిణ భారత దేశానికి చెందిన నటి.

మరణాలు

1931: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (జ.1847)
1976: విశ్వనాథ సత్యనారాయణ “కవి సమ్రాట్”, తెలుగు వారిలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895)
2004: వీరప్పన్, గంధపు చెక్కల స్మగ్లర్. (జ.1952)
2013: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1927)
2014: తవనం సుబ్బాయమ్మ, మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు, పలు సార్లు ఉద్యమాలు నిర్వహించారు.
2016: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (జ.1952)
2018: నారాయణదత్ తివారీ, భారత జాతీయ కాంగ్రెసు రాజకీయ నాయకుడు (జ.1925).
2022: కల్వల సదానందరావు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు. తెలంగాణ రైతుసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →