Agri colleges - ఈ జిల్లాలకు మూడు అగ్రికల్చర్ కళాశాలలు - bikki news

Agri colleges – ఈ జిల్లాలకు మూడు అగ్రికల్చర్ కళాశాలలు

BIKKI NEWS ((OCT. 18) : 3 NEW AGRICULTURE COLLEGE IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మూడు అగ్రికల్చర్ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

3 NEW AGRICULTURE COLLEGE IN TELANGANA

ప్రస్తుతం వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలలో నూతన వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.

ఈ విద్యాసంవత్సరం నుంచే వీటిని ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది..

ప్రతి కళాశాలకు రూ.124 కోట్ల నిధులను మంజూరు చేయడంతోపాటు 180 మంది చొప్పున బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

ఈ కళాశాలల్లో త్వరలోనే ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా సీట్లను ప్రొ‌. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భర్తీ చేయనుంది.

సూర్యాపేట జిల్లా మగ్దూంనగర్‌ (హుజూర్‌నగర్‌)లో 100 ఎకరాల్లో కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇది అసైన్డ్‌ భూమి కావడంతో సేకరణకు ఎకరాకు రూ.22 లక్షల చొప్పున మొత్తం రూ.22 కోట్లు చెల్లిస్తారు.

వికారాబాద్‌ జిల్లా అప్పాయిపల్లిలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 65 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వ్యవసాయ కళాశాలను స్థాపించనున్నారు.

నిజామాబాద్‌ డిచ్‌పల్లి సమీపంలో సుద్దపల్లి, నడిపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 80 ఎకరాల్లో కళాశాల ఏర్పాటు కానుంది

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →