BIKKI NEWS ((OCT. 18) : 3 NEW AGRICULTURE COLLEGE IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మూడు అగ్రికల్చర్ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
3 NEW AGRICULTURE COLLEGE IN TELANGANA
ప్రస్తుతం వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలలో నూతన వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే వీటిని ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది..
ప్రతి కళాశాలకు రూ.124 కోట్ల నిధులను మంజూరు చేయడంతోపాటు 180 మంది చొప్పున బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
ఈ కళాశాలల్లో త్వరలోనే ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా సీట్లను ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భర్తీ చేయనుంది.
సూర్యాపేట జిల్లా మగ్దూంనగర్ (హుజూర్‌నగర్)లో 100 ఎకరాల్లో కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇది అసైన్డ్ భూమి కావడంతో సేకరణకు ఎకరాకు రూ.22 లక్షల చొప్పున మొత్తం రూ.22 కోట్లు చెల్లిస్తారు.
వికారాబాద్ జిల్లా అప్పాయిపల్లిలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 65 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వ్యవసాయ కళాశాలను స్థాపించనున్నారు.
నిజామాబాద్ డిచ్‌పల్లి సమీపంలో సుద్దపల్లి, నడిపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 80 ఎకరాల్లో కళాశాల ఏర్పాటు కానుంది
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
