BIKKI NEWS (OCT. 06) : INDELIBLE INK APPLICATION FOR VOTERS IN LOCAL BODY ELECTIONS. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు ఇండిలబుల్ ఇంక్ వాడకంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
INDELIBLE INK APPLICATION FOR VOTERS IN LOCAL BODY ELECTIONS
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరియు పంచాయతీరాజ్ ఎన్నికల మధ్య తక్కువ సమయం ఉండడంతో ఓటర్లకు ఇంక్ చెరిగిపోయే అవకాశం లేదు. కనుక ఇంక్ వాడకంపై కీలక ఆదేశాలను జారీ చేసింది.
అక్టోబర్ 23, 27వ తేదీల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఓటర్లకు ఎడమచేతి చూపుడు వేలుకు ఇండిలబుల్ ఇంక్ ను గుర్తుగా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం అక్టోబర్ 31, నవంబర్ 4, 8వ తేదీల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమచేతి మధ్య వేలుకు ఇండిలబుల్ ఇంక్ నుగుర్తుగా వేయాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించే అధికారులు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు ఓటర్లకు ఎడమచేతి చూపుడువేలుకు, పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి మధ్య వేలుకు ఇండిలబుల్ ఇంకును వేయాల్సి ఉంటుంది.

