Today in history చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 28

Today in history చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 28 - bikki news

BIKKI NEWS ( TODAY IN HISTORY – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 28.

Today in history September 28th

దినోత్సవం

సంఘటనలు

1745: బ్రిటన్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ది కింగ్’ మొదటిసారిగా పాడిన రోజు.
1837: బహదూర్ షా- II సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తండ్రి అక్బర్ షా- II మరణం తరువాత 62 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు.
1908: మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
1924: ఢిల్లీలో జరుగుున్న అలర్లు ఆగలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మహాత్మా గాంధీ.
1928: పెన్సిలిన్ను అనుకోకుండా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు.
1954: హైదరాబాదు తూర్పు ప్రాంతంలో వరద దెబ్బతిన్న వంతెనపై నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి 137 మంది మరణించారు
1984: తొలిసారి భారతదేశంలో ఫ్లడ్లైట్స్ క్రింద క్రికెట్ మ్యాచ్ జరిగింది. న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియా ఇండియా నడుమ జరిగిన మ్యాచ్ను ఫ్లడ్లైట్స్ క్రింద ఆడారు.
1985: భారతదేశంలో మొదటిసారి తెరచాప పడవలో భూగోళాన్ని చుట్టే గుఱితో భారతీయ సేన జట్టు బొంబాయి నుండి తృష్ణ అనే చిన్నోడలో బయలుదేరింది. (పూర్తి 10-1-87)
1993: కరకాస్ జాతీయ రహదారి క్రింద గ్యాస్ పైపు పేలి 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
1996: ఆస్తుల కేసులో సుఖ్ రామ్ తీహార్ జైలుకు పంపబడ్డాడు.
2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
2013: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ భారీ “తెలంగాణ ప్రజాగర్జన” బహిరంగ సభ నిర్వహించబడింది.
2016: యూరీలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపినందుకు పగసనదీర్పుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్-2 అనే దాడి జరిపింది.

జననాలు

0551 క్రీ.పూ.: కన్ఫ్యూషియస్, కన్ఫ్యూషియస్ మత స్థాపకుడు. (మ.0479 క్రీ.పూ.).
1835: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (మ.1918)
1895: గుర్రం జాషువా, ప తెలుగు కవి. (మ.1971)
1907: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931)
1909: పైడి జైరాజ్, భారత సినీరంగ నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000)
1915: స్థానాపతి రుక్మిణమ్మ, సంస్కృతాంధ్ర పండితురాలు, రచయిత్రి.
1929: లతా మంగేష్కర్, గాన కోకిల. (మ. 2022)
1946: మాజిద్ ఖాన్, భారతీయ- పాకిస్థానీయ క్రికెటర్.
1965: కవిత, తెలుగు, తమిళ చిత్రాల నటి.
1966: పూరి జగన్నాథ్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
1969: వేణు మాధవ్, తెలుగు సినీ నటుడు . (2019)
1982: అభినవ్ బింద్రా, తొలి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ గురిపందెం ఆటగాడు.
1982: రణబీర్ కపూర్, హిందీ సినీ నటుడు, నిర్మాత.

మరణాలు

1895: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (జ.1822)
1940: పండిత్ సుందర్ లాల్ శర్మ, “ఛత్తీస్‌గఢ్ గాంధీ”, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త (జ.1881)
1968: కూర్మాపు నరసింహం, చిత్రకారుడు.
1973: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (జ.1890)
1980: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్‌. (జ.1911)
1991: శంకర్ గుహ నియోగి, ఛత్తీస్గఢ్ కార్మికోద్యమ నాయకుడు.
1994: వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912)
2004: ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత. (జ.1905)
2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911)
2007: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (జ.1920)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →