Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 15.

Today in history - చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 15. - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 15.

Today in history September 15th

దినోత్సవం

సంఘటనలు

1931: భక్త ప్రహ్లాద [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు.
1939: రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సేనలు కొన్‌స్కొవొలా గ్రామాన్ని ఆక్రమించాయి.
2000: 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీలో ప్రారంభమయ్యాయి.
2006: 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానా లో ప్రారంభమైనది.
2009: తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.

జననాలు

1856: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (మ.1923)
1861: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (మ.1962)
1890: పులిపాటి వెంకటేశ్వర్లు, తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు (మ.1972)
1892: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1989)
1900: కేదారిశ్వర్ బెనర్జీ, భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (మ.1975)
1909: రోణంకి అప్పలస్వామి, సాహితీకారుడు. (మ.1987)
1923: నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, రేడియో కళాకారులు.
1925: శివరాజు సుబ్బలక్ష్మి, రచయిత్రి, చిత్రకారిణి.
1926: అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (మ. 2015).
1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు రచయిత.
1942: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)
1961: పాట్రిక్ ప్యాటర్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1967: రమ్యకృష్ణ, నటి.
1970: శశి ప్రీతం , సంగీత దర్శకుడు,గాయకుడు , గీత రచయిత.
1980: అంబికా ఆనంద్, భారతీయ టి.వి. వ్యాఖ్యాత.
1985: నేహా ఒబెరాయ్ , బాలీవుడ్ నటి.
1988: శ్రీమణి , తెలుగు సినీ గీత రచయిత

మరణాలు

1963: పొణకా కనకమ్మ, గొప్ప సంఘ సంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (జ.1892)
1972: కె.వి.రెడ్డి , తెలుగు చలనచిత్ర దర్శకుడు .(జ.1912)
1998: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1923)
2015: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, హిందీ చందమామ సంపాదకుడు. (జ.1928)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →