BIKKI NEWS: Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 02
Today in history September 02
దినోత్సవం
- ప్రపంచ కొబ్బరి దినోత్సవం.
సంఘటనలు
1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో 21మంది మృతిచెందగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
2012 : నిర్మల్లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
జననాలు
1914: వాసిరెడ్డి భాస్కర రావు, నాటక రచన, బుర్రకథలు, సినీ పాటల రచయిత, సంభాషణల రచయిత (మ.1957)
1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితుడు.
1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013)
1932: స్యూ మెంగెర్స్, నటి (మ.2011)
1936: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989)
1942: బాడిగ రామకృష్ణ, 14 వ లోక్‌సభ సభ్యుడు.
1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, రచయిత, సాహితీవేత్త. (మ.2005)
1956: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు (మ. 2018).
1965: సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్
1968: జీవిత, నటి, రాజకీయ నాయకురాలు.
1968: అనుపమ , ప్లే బ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ , నటి.
1971: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.
1986: పార్నంది భగవతి కృష్ణ శర్మ, ఆధునిక కవి, జానపద కళాకారుడు, గాయకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత, పండితుడు.
మరణాలు
1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు (జ.1892).
1992: బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902).
2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949).
2022: మందాడి సత్యనారాయణ రెడ్డి, రాజకీయనాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే. (జ.1936)

