BIKKI NEWS : Intermediate Colleges Affiliation. తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు పొందడానికి 55 కళాశాలలు నకీలీ NOC పత్రాలు సమర్పించినట్లు సమాచారం. మరోవైపు 27 కళాశాలలు అడ్మిషన్లు ఈ ఏడాది చేపట్టలేదని బోర్డు కు స్వచ్చందంగా తెలిపినట్లు సమాచారం.
Intermediate Colleges Affiliation
ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సంబంధించి మొత్తం 3,241 కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ చేసింది. గత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 3,349గా ఉంది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి గుర్తింపు పొందిన కళాశాలల సంఖ్య తగ్గింది.
మరో 100 కళాశాలలకు అనుమతులు?
ప్రస్తుతం అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలలతో పాటు మరో 100 వరకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటిలో 55 కళాశాలలు నకీలీ NOC పత్రాలు సమర్పించినట్లు సమాచారం.
అడ్మిషన్లు తీసుకోని కళాశాలలు రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్ జిల్లాలో 7, హైదరాబాద్ జిల్లాలో 6 కలవు .
విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం
ఇంటర్మీడియట్లో ప్రవేశాలు పొందే విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాలలో చేరే ముందు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అనుబంధ గుర్తింపు ఉందో లేదో నిర్ధారించుకోవాలి.

