BIKKI NEWS (SEP. 23) : Telangana degree spot admissions 2026. తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటివరకు సీటు పొందని లేదా రిపోర్టింగ్ చేయని అర్హులైన అభ్యర్థులు నేరుగా కాలేజీలను సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చు.
Telangana degree spot admissions 2026
ముఖ్యమైన తేదీలు (స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్)
- ఖాళీ సీట్ల వివరాల వెల్లడి: సెప్టెంబర్ 23, 2026
- మొదటి విడత స్పాట్ అడ్మిషన్ల : సెప్టెంబర్ 24, 25 తేదీలు
- రెండో విడత స్పాట్ అడ్మిషన్లు: సెప్టెంబర్ 28, 29 తేదీలు
అర్హతలు & ముఖ్య నియమాలు : ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
గత విడతల్లో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు సంబంధిత కళాశాలలో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
స్పాట్ అడ్మిషన్లలో సీటు పొందే అభ్యర్థులకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ (RTF/ePass) వర్తించదు; పూర్తి ఫీజును విద్యార్థే చెల్లించాల్సి ఉంటుంది.
ప్రవేశాలు పూర్తిగా మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా కళాశాల స్థాయిలోనే జరుగుతాయి.
అవసరమైన పత్రాలు (సర్టిఫికెట్లు)
SSC / 10వ తరగతి మార్కుల మెమో
ఇంటర్మీడియట్ మార్కుల మెమో
బదిలీ ధ్రువీకరణ పత్రం (TC)
బోనఫైడ్ / స్టడీ సర్టిఫికెట్లు
ఆధార్ కార్డు
కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
కాలేజీల వారీగా ఖాళీగా ఉన్న సీట్లు, కోర్సుల వివరాల కోసం అధికారిక పోర్టల్ సందర్శించవచ్చు.
అధికారిక వెబ్సైట్: dost.cgg.gov.in

