BIKKI NEWS : Standard GK bits 172 for compititive exams. – జనరల్ నాలెడ్జ్ బిట్స్.
Standard GK bits 172 for compititive exams
1) ఆజీవక తత్వశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్ణయించే ప్రధాన భావం ఏమిటి?
జ : నియాతి
2) సోమనాథ ఆలయాన్ని కట్టించింది రాజ్య వంశం ఏది?
జ : సోలంకీలు
3) అయిహోల్ ఆలయాన్ని నిర్మించినది ఎవరు.?
జ : బాదామి చాళుక్యులు
4) 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్తగా ఏర్పడిన ఏ జిల్లాలో 40% కంటే అధికంగా పట్టణ జనాభా ఉంది.?
జ : మంచిర్యాల్
5) 2020 – 21 లెక్కల ప్రకారం అటవీ విస్తీర్ణ శాతం అధికంగా ఉన్న మొదటి మూడు జిల్లాలు ఏవి.?
జ : ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్
6) భారత్ లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 1857 మే 10
7) 1857 తిరుగుబాటుదార్లు ఎవరిని తమ ప్రతినిధిగా ప్రకటించారు.?
జ : రెండో బహదూర్ షా
8) రెండో బహదూర్ షా ఎవరు.?
జ : మొఘల్ చివరి చక్రవర్తి
9) భారత దేశంలో భేటీ పత్తిని ఎప్పుడు ప్రవేశ పెట్టారు.?
జ : 2002
10) 2011 లో ప్రపంచం నుండి పూర్తిగా తొలగించబడినట్లు పేర్కొనబడిన రెండవ వైరల్ వ్యాధి ఏమిటి.?
జ : రిండర్‌పెస్ట్
11) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధా) పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : జాన్ మెక్ కార్తీ
12) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : బెంగళూరు
13) ఇనిస్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : మోహాలి
14) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్
15) భారత దేశంలో లభించే యురేనియం ఏ రకానికి చెందినది.?
జ : తక్కువ శ్రేణి నాణ్యత
16) అధిక నాణ్యత గల కంపోస్ట్ కలిగి ఉండవలసిన కార్బన్ మరియు నైట్రోజన్ల నిష్పత్తి ఎంత.?
జ : 30 : 1
17) 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC) జనాభాలో అతి తక్కువ అక్షరాస్యత రేటు కలిగి ఉన్న రాష్ట్రం ఏది.?
జ : బీహార్
18) వశిష్ట పుత్ర శాంత మూల స్థాపించిన రాజ్య వంశం ఏది?
జ : ఆంధ్ర ఇక్ష్వాక
19) శ్రీ కృష్ణ కమిటీ సెక్రటరీ ఎవరు.?
జ : వీకే దుగ్గల్
20) కేసరి సముద్రం చెరువును నిర్మించిన రాజు ఎవరు.?
జ : మొదటి ప్రోల రాజు
21) ద్రవ స్థితిలో ఉండే ఒకే అలోహం ఏది.?
జ : బ్రోమిన్
22) బ్లీచింగ్ పౌడర్ ని నీటి లో కరిగిస్తే వెలువడే వాయువు ఏది.?
జ : క్లోరిన్
23) బ్రైన్ ద్రావణం అనగానేమి.?
జ : సోడియం క్లోరైడ్ ద్రావణం
24) సింధు ప్రజలు విగ్రహాలను దేనితో తయారు చేసేవారు.?
జ : రాయి మరియు లోహం
25) మొహంజదారో అనగా అర్థం ఏమిటి.?
జ : మృతుల దిబ్బ
26) టెర్రా కోట అనగా నేమి.?
జ : కాల్చిన బంక మట్టి నిర్మాణాలు
27) భారత దేశానికి ఇండియా అనే పేరు ఏ నది ఆధారంగా వచ్చింది.?
జ : సింధూ నది
28) భారత దేశం అక్షాంశాల పరంగా ఏ గోళంలో ఉంది.?
జ : ఉత్తరార్థ గోళం
29) భారత దేశం రేఖాంశాల పరంగా ఏ గోళంలో ఉంది.?
జ : పూర్వార్ధగోళం
30) కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ రాజధానులు ఏవి.?
జ : లేహ్ (వేసవి), కార్గిల్ (శీతాకాలం)

