Swaccha Bharat – హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వచ్ఛభారత్

Swaccha bharat at gjc girls husnabad.

BIKKI NEWS (SEP. 17) : Swaccha Bharat at GJC girls Husnabad. హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ మరియు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.

Swaccha Bharat at GJC girls Husnabad.

హుస్నాబాద్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ,విద్యార్థినిలు మొదలగు వారందరూ స్వచ్ఛ భారత్ కు సంబంధించిన ప్రతిజ్ఞను చేయడం జరిగింది. అనంతరం జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్ )ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో మరియు గేటు దగ్గర నిర్వహించడం జరిగింది.

.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వి.లలిత గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి వీ లలిత గారు మాట్లాడుతూ ప్లాస్టిక్ మరియు వ్యర్ధాల వలన ఏర్పడే అనర్థాలు గురించి తెలియజేస్తూ వాలంటీర్లు మరియు సమాజంలోని ప్రజలందరూ తమ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొంటూ పరిశుభ్రత పాటించినప్పుడే సమాజంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి సమాజం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు.

అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రూపులుగా ఏర్పడి కళాశాలలో ఉన్న చెత్త మరియు ముళ్ళ పొదలను మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించడం జరిగింది.

ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి D. కరుణాకర్ గారి యొక్క పర్యావేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందము డి రవీందర్, ఎస్ సదానందం, T.నిర్మలాదేవి, బి లక్ష్మయ్య, ఏ సంపత్ ,ఎస్ కవిత, కే స్వరూప, జి కవిత , ఆస్మాపిర్దోస్, ఓ రాణి, జూనియర్ అసిస్టెంట్లు కే గీతాంజలి, ఎస్ రాములు, రికార్డ్ అసిస్టెంట్ టి రమాదేవి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినిలు మొదలగు వారు పాల్గొన్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →