BIKKI NEWS (Sep. 06) : 2nd PRC fitment after telangana assembly sessions. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగస్తులకు సంబంధించి రెండో పిఆర్‌సి ఫిట్ మెంట్ ప్రకటన, పెండింగ్ డీఏ , నిధులు విడుదల మరియు వివిధ సమస్యలను అసెంబ్లీ సమావేశాల తర్వాత పూర్తి చేస్తామని ఉద్యోగ సంఘ నాయకులకు మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్లు సమాచారం.
2nd PRC fitment after telangana assembly sessions
సెప్టెంబర్ 10వ తేదీన ఉద్యోగ సంఘ నాయకులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు లక్ష మంది ఉద్యోగులతో ఈ సమావేశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించి, తదనంతరం నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ హామీలపై ఉద్యోగ సంఘ నాయకులు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో, మరియు చలో హైదరాబాద్ కార్యక్రమం, నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
