BIKKI NEWS (Sep 06) : Bhatti meeting with Employees union leaders today. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులతో ఈరోజు సాయంత్రం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రగతి భవన్ లో కీలక చర్చలు జరపనున్నారు.
Bhatti meeting with Employees union leaders today
సెప్టెంబర్ 10న ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై చలో హైదరాబాద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు ఆహ్వానాలు అందాయి.
ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లుగా పిఆర్సి ప్రకటన, పాత పెన్షన్ పద్ధతి అమలు, పెండింగ్ బిల్లులు, డీఏల చెల్లింపు వంటిని లేవనెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరు డిఏలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
అలాగే నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు పై కూడా పలు సందేహాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంతో నేటి చర్చలు కీలకం కానున్నాయి.
