Today top news in Telugu July 27th 2026 – నేటి ప్రధాన వార్తలు
Today top news in Telugu July 27th 2026
Telangana News
పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో నిలబడి అభ్యర్థుల వయోపరిమితిని తగ్గించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
వర్షాభావ పరిస్థితులలో నేటి నుంచి రైతు వేదికల్లో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ప్రభుత్వం అందించనుంది .
అదిలాబాద్ విమానాశ్రయానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాదులో 2018 నాటి టీబీపీఎస్సీ పరీక్షలు ఓఎంఆర్ షీట్లు కనిపించడంతో విచారణ చేపట్టిన బోర్డు
దేశవ్యాప్తంగా కేంద్రం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
Andhra Pradesh News
ఏడు వేల ఎకరాలలో మడ అడవులను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రైవేటు యూనివర్సిటీలలో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 13,610 గా తేలింది.
National News
నందన్ నీలేకని నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని పరీక్షల సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
పాకిస్తాన్ తో చర్చలు అంటే పిఓకే పైనే అని రాజ్నాధ్ సింగ్ స్పష్టం చేశారు.
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు.
ఇకపై ఏ ఎన్నికల్లోను పోటీ చేయనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన విజయం ఆరంభం మాత్రమేనని అజిత్ దీప్కే తెలిపారు.
International News
8 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన హ్యోమోగాములు
భారత కరెన్సీ పై విధించిన ఆంక్షలను సడలించిన నేపాల్.
నైరుతి ప్రాన్స్ లో ప్రారంభమైన కార్చిచ్చు వేగంగా విస్తరిస్తుంది.
చైనాను వణికిస్తున్న భారీ తుఫాన్ నౌల్. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.
Business News
అంతర్జాతీయ యుద్ధభయాలు ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలను నియంత్రించనున్నాయి.
ఆగస్టు నెలలో 25 వేల కోట్ల విలువైన ఐపివోలు మార్కెట్లో సందడి చేయనున్నాయి
Sports News
జింబాబ్వే తో జరిగిన మూడో టి20 లో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
గ్లాస్గో లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను పసిడి పతకం, రిషికాంత రజత పతకం సాధించారు.
అంతర్జాతీయ టి20 లో భారత పురుషుల జట్టు తిరిగి మొదటి స్థానాన్ని సాధించుకుంది.
Educational and Jobs updates
TG PGECET 2026 తొలి విడత సీట్లు కేటాయింపు పూర్తి
