Nagarjuna university - నాగార్జున వర్సిటీ దూరవిద్యపై ఆందోళన వద్దు - bikki news

Nagarjuna University – నాగార్జున వర్సిటీ దూరవిద్యపై ఆందోళన వద్దు

BIKKI NEWS (APRIL 29) : No need to worry about Nagarjuna University’s distance learning. ఆచార్య నాగార్జున యూనివర్సిటి దూరవిద్య ద్వారా డిగ్రీలు పొందిన తెలంగాణ విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, వారి భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిఎం ప్రజావాణి ఇంఛార్జ్ చిన్నారెడ్డి హామీ ఇచ్చారు.

No need to worry about Nagarjuna University’s distance learning

ప్రజా భవన్ లో మంగళ వారం జరిగిన సిఎం ప్రజా వాణికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి దూరవిద్యలో చదివిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపిలతో పాటు పలు దూరవిద్య యూనివర్సిటిలలో డిగ్రీ, పీజీలు పూర్తిచేసుకున్న వారందరికి 2021 వరకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని వారు పేర్కొన్నారు.

అయితే 2022 నుంచి నాగార్జున యూనివర్సీటి పరిధిలో దూరవిద్య ద్వారా చదివిన విద్యార్థులను అనర్హులుగా పరిగణించి ఆ సర్టిఫికెట్ లను అనుమతించడం లేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి వెంటనే విద్యాశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →