Telangana job mela - మే నెలలో ప్రభుత్వ జాబ్ మేళాలు - bikki news

Telangana Job Mela – మే నెలలో ప్రభుత్వ జాబ్ మేళాలు

BIKKI NEWS (APRIL 28) : Telangana Job Mela schedule 2026. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో భారీగా జిల్లా కేంద్రాలలో జాబ్ మేళాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.

Telangana Job Mela schedule 2026

దాదాపు 20 వేల ప్రైవేటు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాలను మీ ఒకటవ తేదీ నుండి ప్రజా పాలనలో భాగంగా నిర్వహించనున్నారు.

ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, డిజిటల్ మీడియా, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాలలో ఉద్యోగాలను కల్పించనున్నారు.

పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లమా పీజీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలలోని ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో హాజరు కావచ్చు. ఇందుకోసం కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

Job mela schedule 2026

మహబూబ్ నగర్ – మే 01
నల్గొండ – మే 02
ఖమ్మం – మే 04
కరీంనగర్ – మే 05
ఆదిలాబాద్ – మే 06
పెద్దపల్లి – మే 06
నిజామాబాద్ – మే 07
సంగారెడ్డి – మే 08
వరంగల్ – మే 08
రంగారెడ్డి – మే 11
హైదరాబాద్ – మే 12

వెబ్సైట్ : https://satg.telangana.gov.in/prajapalana/welcome

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →