హైదరాబాద్ (ఏప్రిల్ 12) : Telangana SUPPLEMENTARY EXAM FEE 2026 . తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల అనంతరం, ఫెయిల్ అయిన విద్యార్థులకు మరియు మార్కులు పెంచుకోవాలనుకునే (Improvement) వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మే-2026 పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Telangana SUPPLEMENTARY EXAM FEE 2026
సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏప్రిల్ 20-2026 వరకు కలదు. విద్యార్థులు ఫీజు కళాశాలలో చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పరీక్షలు మే 13 – 2026 నుండి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ తమ కళాశాలల్లో పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది
FIRST YEAR GENERAL & VOCATIONAL EXAM FEE :
- పరీక్ష ఫీజు : 530 /- (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టులు)
- బ్రిడ్జి కోర్సుతొ కలిపి – 770/-
- కేవలం బ్రిడ్జి కోర్సు – 530/-
- ఇంగ్లీష్ ప్రాక్టికల్ – 100/-
- పరీక్ష ఫీజు + బ్రిడ్జి కోర్సు + ప్రాక్టికల్ – 950/-
SECOND YEAR GENERAL & VOCATIONAL EXAM FEE :
- పరీక్ష ఫీజు : 530 /- (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టులు)
- పరీక్ష ఫీజు + ప్రాక్టికల్ – 770/-
- పరీక్ష ఫీజు + బ్రిడ్జి కోర్సు + ప్రాక్టికల్ – 950/-
- ఫస్టీయర్ + సెకండీయర్ : 1060/-
- వోకేషనల్ (పరీక్ష ఫీజు + ప్రాక్టికల్ + బ్రిడ్జి కోర్సు + బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్) – 1190/-
IMPROVEMENT EXAM FEES
- పరీక్ష ఫీజు – 530 /+ + సబ్జెక్టుకు 180/-
విద్యార్థులు గమనించవలసిన ముఖ్య విషయాలు:
- ఇంప్రూవ్మెంట్ అవకాశం: ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి ‘ఇంప్రూవ్మెంట్’ పరీక్షలు రాసే అవకాశం ఉంది.
- ఫీజు చెల్లింపు: విద్యార్థులు తమ ఫీజును సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ వద్ద మాత్రమే చెల్లించాలి. ఆన్లైన్ పేమెంట్ సౌకర్యం కళాశాల లాగిన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- ప్రాక్టికల్ పరీక్షలు: సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ప్రాక్టికల్ పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కోసం కళాశాల సంప్రదించాలి.
- రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్: ఫలితాలపై సంతృప్తి లేని వారు రీ-కౌంటింగ్ లేదా ఫోటో కాపీతో కూడిన రీ-వెరిఫికేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
