Supplementary exam fee 2026 -పరీక్ష ఫీజు పూర్తి వివరాలు - bikki news

SUPPLEMENTARY EXAM FEE 2026 -పరీక్ష ఫీజు పూర్తి వివరాలు

హైదరాబాద్ (ఏప్రిల్ 12) : Telangana SUPPLEMENTARY EXAM FEE 2026 . తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల అనంతరం, ఫెయిల్ అయిన విద్యార్థులకు మరియు మార్కులు పెంచుకోవాలనుకునే (Improvement) వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మే-2026 పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Telangana SUPPLEMENTARY EXAM FEE 2026

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏప్రిల్ 20-2026 వరకు కలదు. విద్యార్థులు ఫీజు కళాశాలలో చెల్లించాల్సి ఉంటుంది.

​ఈ పరీక్షలు మే 13 – 2026 నుండి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ తమ కళాశాలల్లో పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది

FIRST YEAR GENERAL & VOCATIONAL EXAM FEE :

  • పరీక్ష ఫీజు : 530 /- (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టులు)
  • బ్రిడ్జి కోర్సుతొ కలిపి – 770/-
  • కేవలం బ్రిడ్జి కోర్సు – 530/-
  • ఇంగ్లీష్ ప్రాక్టికల్ – 100/-
  • పరీక్ష ఫీజు + బ్రిడ్జి కోర్సు + ప్రాక్టికల్ – 950/-

SECOND YEAR GENERAL & VOCATIONAL EXAM FEE :

  • పరీక్ష ఫీజు : 530 /- (ఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టులు)
  • పరీక్ష ఫీజు + ప్రాక్టికల్ – 770/-
  • పరీక్ష ఫీజు + బ్రిడ్జి కోర్సు + ప్రాక్టికల్ – 950/-
  • ఫస్టీయర్ + సెకండీయర్ : 1060/-
  • వోకేషనల్ (పరీక్ష ఫీజు + ప్రాక్టికల్ + బ్రిడ్జి కోర్సు + బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్) – 1190/-

IMPROVEMENT EXAM FEES

  • పరీక్ష ఫీజు – 530 /+ + సబ్జెక్టుకు 180/-
విద్యార్థులు గమనించవలసిన ముఖ్య విషయాలు:
  1. ఇంప్రూవ్‌మెంట్ అవకాశం: ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి ‘ఇంప్రూవ్‌మెంట్’ పరీక్షలు రాసే అవకాశం ఉంది.
  2. ఫీజు చెల్లింపు: విద్యార్థులు తమ ఫీజును సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ వద్ద మాత్రమే చెల్లించాలి. ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యం కళాశాల లాగిన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  3. ప్రాక్టికల్ పరీక్షలు: సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ప్రాక్టికల్ పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కోసం కళాశాల సంప్రదించాలి.
  4. రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్: ఫలితాలపై సంతృప్తి లేని వారు రీ-కౌంటింగ్ లేదా ఫోటో కాపీతో కూడిన రీ-వెరిఫికేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →