Nios ded - 11 మందికి టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు - bikki news

NIOS DEd – 11 మందికి టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్ (ఏప్రిల్ 10) : Teacher jobs for NIOS DEd Candidates. జాతీయ ఓపెన్ స్కూల్ ద్వారా ఏడాదిన్నర డీఈడీ కోర్సు పూర్తి చేసిన 11 మందికి టీచర్ ఉద్యోగాలు ఇస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ 2024 కింద వీరికి ఈ ఉద్యోగాలను కల్పించింది.

Teacher jobs for NIOS DEd Candidates

వీరు కేవలం ఏడాదిన్నర డీఈడీ కోర్సును మాత్రమే పూర్తి చేశారని, NCTE నిబంధనల ప్రకారం రెండేళ్ల డీఈడి కోర్సు పూర్తి చేసిన వారికే టీచర్ ఉద్యోగాలకు అర్హత ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వీరికి 2024 డీఎస్సీ లో పోస్టింగ్ లు ఇవ్వలేదు.

మళ్ళీ సుప్రీంకోర్టు డిసెంబర్ 2024 లో NIOS ద్వారా డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలకు అర్హులేనని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ 11 మంది సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వీరికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వారికి ఉద్యోగాలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఇలాగే మరో 20 మంది వరకు అభ్యర్థులు ఉండడంతో వారు కూడా సుప్రీంకోర్టు ను ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →