Retirement benefits - రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే చెల్లించండి - హైకోర్టు - bikki news

Retirement Benefits – రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే చెల్లించండి – హైకోర్టు

హైదరాబాద్ (ఏప్రిల్ 09) : High court orders for Pay retirement benefits to employees immediately. పదవి విరమణ పొందిన ఉద్యోగులందరికీ వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాము ఇచ్చిన గడువు ఏప్రిల్ 9 తో ముగిసినప్పటికీ అందరికీ బెనిఫిట్స్ చెల్లించలేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

High court orders for Pay retirement benefits to employees immediately

ఒక్క ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకపోయిన ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించింది.

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్, జిపిఎఫ్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఈఎల్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలను తక్షణమే పూర్తిస్థాయిలో చెల్లించాలని స్పష్టం చేసింది.

ఉద్యోగులకు ఒక నెల జీతం ఆపిన పర్వాలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

జూన్ 10 వరకు గడువు

జూన్ 10వ తారీకుకు తదుపరి విచారణ వాయిదా వేస్తూ… ఆ రోజు నాటికి ఒక్క ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ ఉన్న ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఉద్యోగి హక్కుగా పొందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ప్రభుత్వ సొమ్ము కాదని అది ఉద్యోగుల వ్యక్తిగత సోమ్ము అని, ఏళ్ల తరబడి దాచుకున్న నిధి వారి అవసరాలకు ఉపయోగపడటం లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →