హైదరాబాద్ : Today top Current affairs april 4th 2026 – కరెంట్ అఫైర్స్
Today top Current affairs april 4th 2026
1) భారతదేశపు మూడవ అణు సామర్థ్యం గల బాలిస్టిక్ మిస్సైల్ సబ్మెరైన్ (SSBN) ఏప్రిల్ 4న విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. దాని పేరు ఏమిటి?
జ : INS అరిధామన్ (INS Aridhaman). ఇది భారతదేశ రెండవ స్ట్రైక్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
2) కేంద్ర ప్రభుత్వం ఏ విద్యా సంస్థకు ఇటీవల ‘డీమ్డ్ యూనివర్సిటీ’ హోదాను కల్పించింది?
జ : NCERT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్).
3) 2036 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం భారత్ చేస్తున్న బిడ్ (Bid) పనులకు బాధ్యుడిగా ఏ క్రీడా దిగ్గజం నియమితులయ్యారు?
జ : లియాండర్ పేస్.
ఆర్థికం & నివేదికలు (Economy & Reports)
4) ఇటీవల ప్రారంభించిన ‘నేషనల్ క్వాంటం కంప్యూటింగ్ మిషన్’ కోసం కేంద్రం ఎంత మొత్తాన్ని కేటాయించింది?
జ : ₹6,000 కోట్లు.
5) ఏప్రిల్ 4న జరిగిన భారత్-అజర్‌బైజాన్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల (6వ రౌండ్) వేదిక ఏది?
జ ) బాకు (Baku), అజర్‌బైజాన్.
6) గినియా వార్మ్ (Guinea worm) వ్యాధిని పూర్తిగా నిర్మూలించినట్లు ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది?
జ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).
7) నాసా ప్రయోగించిన ‘ఆర్టెమిస్ II’ మిషన్‌లో చంద్రుని కక్ష్యలోకి వెళ్లనున్న మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు?
జ : క్రిస్టినా కోచ్ (Christina Koch).
8) 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఏ బ్రిగేడ్ ఇటీవల తన 56వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది?
జ : ఆల్బర్ట్ ఎక్కా బ్రిగేడ్
9) అమెరికా బుక్ క్రిటిక్స్ అవార్డు పొందిన అరుంధతి రాయ్ తాజా రచన ఏది.?
జ : మదర్ మేరీ కం టు మీ
10) రాజా రవివర్మ గీసిన ఏ చిత్రం తాజాగా 167 కోట్లకు వేలంలో అమ్ముడుపోయింది.?
జ : చిన్ని కృష్ణుడు – యశోద చిత్రం
11) బుకర్ ప్రైజ్ 2026 తుది జాబితాలో చోటు సంపాదించుకున్న భారత రచయిత్రి ఎవరు .?
జ : పద్మా విశ్వనాథన్
12) ఆర్టిమిస్ 2 యాత్రకు ఉపయోగిస్తున్న వాహక నౌక పేరు ఏమిటి?
జ : ఒరాయున్
13) 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతుల విలువ ఎంత.?
జ : 38,424 కోట్లు

