BIKKI NEWS (MAR. 23) : TIGLA Thankful to CM REVANTH REDDY on mid day meals in GJCS. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటన పట్ల తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం(టిగ్లా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీమ్ పాషా హర్షాన్ని వ్యక్తం చేశారు.
TIGLA Thankful to CM REVANTH REDDY on mid day meals in GJCS.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇంటర్ విద్యకు శుభపరిణామమని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతారని వారు తిని తినక కాలేజీలకు వచ్చి అర్ధాకలితో తరగతులకు హాజరవుతూ ఇన్నాళ్లు ఎన్నో అవస్తలు పడ్డారని అన్నారు.
ఇప్పుడు విద్యార్థులకు ఆ పరిస్థితి ఉండదని ఈ పథకంతో కడుపు నిండిన విద్యార్థులు చదువుపై ఆసక్తి కనబరుస్తారని అన్నారు. విద్యార్థుల హాజరు శాతం కూడా గణనీయంగా పెరుగుతుందని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల/ఇంటర్ విద్య బలోపేతానికి ఇది బాగా ఉపకరిస్తుందని తెలియజేస్తూ గౌ. ముఖ్యమంత్రి గారికి టిగ్లా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
- Nirmal NHM Recruitment 2026 – 36 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- Telangana cabinet meeting – అక్టోబర్ 1న మంత్రివర్గ సమావేశం
- DMHO Nalgonda Recruitment 2026 : ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ANM సహా 24 పోస్టులు
- Top current affairs in Telugu 30th September 2026
- Today top current affairs in Telugu 29th September 2026

