Tg all entrance tests 2026 application links by bikki news

TG All Entrance Tests 2026- అన్ని ప్రవేశ పరీక్షల వివరాలు, లింక్స్

BIKKI NEWS (MAR. 08) : TG all Entrance Tests 2026 Application links. తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CETs) షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి అధికారికంగా విడుదల చేసింది.

TG all Entrance Tests 2026 Application links

​ఈ ఏడాది మే 4 నుంచి జూన్ 3 వరకు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే TG EAPCET, ICET, LAWCET వంటి ప్రధాన పరీక్షల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు గడువు ముగియక ముందే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

పరీక్షఅర్హతగడువు పరీక్ష తేదీ
TG
EAPCET (Engineering)
ఇంటర్ (MPC)2026 ఏప్రిల్ 42026 మే 9, 10, 11
TG EAPCET (Agri/Pharma)ఇంటర్ (BiPC)2026 ఏప్రిల్ 42026 మే 4, 5
TG EdCETఏదైనా డిగ్రీ/PG2026 ఏప్రిల్ 152026 మే 12
TG ICETఏదైనా డిగ్రీ2026 మార్చి 162026 మే 13, 14
TG ECETడిప్లొమా/B.Sc (Maths)2026 ఏప్రిల్ 182026 మే 15
TG LAWCET (3 Years)ఏదైనా డిగ్రీ2026 ఏప్రిల్ 12026 మే 18
TG LAWCET (5 Years)ఇంటర్2026 ఏప్రిల్ 12026 మే 18
TG PECETడిగ్రీ/ఇంటర్2026 మే 52026 మే 31 – జూన్ 3
TG POLYCET10వ తరగతి2026 ఏప్రిల్ 202026 మే 13
TG PGECETB.E/B.Tech/B.Pharm2026 మే 62026 మే 28 – 31
TG MSAT (Model School)5వ-9వ తరగతి2026 మార్చి 102026 ఏప్రిల్ 19

ముఖ్యమైన సూచనలు:

  • దరఖాస్తు విధానం: అన్ని పరీక్షలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆలస్య రుసుము: పైన పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత కూడా నిర్ణీత ఆలస్య రుసుముతో (Late Fee) దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
  • హాల్ టికెట్లు: పరీక్షకు వారం లేదా పది రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

​విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాలని, పరీక్షా కేంద్రాలు మరియు నిబంధనల గురించి ఎప్పటికప్పుడు అధికారిక ప్రకటనలను గమనిస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →