BIKKI NEWS (FEB. 25) : Protest in kallem village on Kommera mallana issue,ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అగ్రవర్ణ దుండగులు జరిపిన దాడిలో మృతి చెందిన దుర్ఘటనను ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ చౌరస్తా- కళ్ళెం లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మబ్బు క్రాంతి కుమార్, మహాజన యూత్ అధ్యక్షులు బోట్ల వెంకటేష్ గార్ల ఆధ్వర్యంలో యువజన సంఘాల సమాఖ్య- కళ్ళెం నిరసన కార్యక్రమం చేపట్టారు.
Protest in kallem village on Kommera mallana issue
మృతిచెందిన చిన్నారి మౌనిక కోసం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల మీద అగ్రవర్ణాల పెత్తనం, అహంకారం ఇంకా ఎన్నినాళ్లు కొనసాగిస్తారని పలువురు యువజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు,వార్డు మెంబర్స్, యువజన సంఘాల నాయకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Team India – 405 పరుగుల లక్ష్యాన్ని చేదించిన టీమిండియా
- October Month holidays list 2026 – అక్టోబర్ నెల సెలవులు
- CM Revanth Reddy : ప్రభుత్వాన్ని నడపడంలో ఉద్యోగుల పాత్ర కీలకం : సీఎం రేవంత్ రెడ్డి
- Nirmal NHM Recruitment 2026 – 36 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- Telangana cabinet meeting – అక్టోబర్ 1న మంత్రివర్గ సమావేశం

