విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించనున్న బండి సంజయ్ - bikki news

విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించనున్న బండి సంజయ్

BIKKI NEWS (NOV.05) : 10th exam fee paid by bandi sanjay in Karimnagar parliament constituency. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల ఫీజు భారం కారాదని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం నావంతుగా ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల ఫీజును నా వేతనం నుండి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాను.

10th exam fee paid by bandi sanjay in Karimnagar parliament constituency.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్నారు.

  • కరీంనగర్ జిల్లా – 4,847 మంది
  • సిరిసిల్ల జిల్లా – 4,059 మంది
  • సిద్ధిపేట జిల్లా – 1,118 మంది
  • జగిత్యాల జిల్లా – 1,135 మంది
  • హన్మకొండ జిల్లా – 1,133 మంది

ఈ విద్యార్థులందరి పరీక్ష ఫీజుల కోసం సుమారు ₹15 లక్షలు అవసరం. ఈ మొత్తాన్ని నా వేతనం నుండి పూర్తిగా భరించాలనే నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే ఇందుకు సంబంధించిన లేఖలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాను.

దేశాన్ని అభివృద్ధి పథం పట్టిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి ప్రేరణతో వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో నా వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →