BIKKI NEWS (AUG. 15) : TRUMP PUTIN MEETING. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు అలస్కా వేదికగా కీలక సమావేశంలో పాల్గొననున్నారు.
TRUMP PUTIN MEETING.
అలస్కాలో భేటీ కావడానికి ప్రధాన కారణం పుతిన్ పై ఉన్న అంతర్జాతీయ అరెస్టు వారెంట్ ఈ ప్రాంతానికి వర్తించదు.
ఈ సమావేశంలో ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అమెరికా విధిస్తున్న సుంకాలు, అంతర్జాతీయ పాణిధ్యం తదితర అంశాలపై ముఖ్యంగా చర్చించనున్నారు.
ఈ భేటీలో ఇండియాపై సుంకాల విధింపు అంశం కూడా చర్చకు రానున్నట్ల సమాచారం. ఇండియా రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దని ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు విఫలం అయితే భారతదేశం పై సుంకాలు పెంపు తప్పదని అమెరికా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

