Trump putiin meeting - ట్రంప్ పుతిన్ భేటీ విశేషాలు - bikki news

TRUMP PUTIIN MEETING – ట్రంప్ పుతిన్ భేటీ విశేషాలు

BIKKI NEWS (AUG. 16) : TRUMP PUTIN MEETING UPDATES. అలస్కా వేదికకు డోనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన భేటీ తుది ఒప్పందం కుదరకుండానే ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన వీరి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణ (ceasefire) పై ఎక్కువగా చర్చ జరిగింది. అయితే దీనిపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

TRUMP PUTIN MEETING UPDATES.

చర్చల అనంతరం ట్రంపు మాట్లాడుతూ… ప్రస్తుతం చర్చలు ఫలప్రదం అయ్యాయని, మరోసారి ఇద్దరం భేటీ అవుతామని ప్రకటించారు. అనేక విషయాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, మరికొన్ని అంశాలపై ఇంకా చర్చించాల్సి ఉందని తెలిపారు. ఈ చర్చల సారాంశంపై తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ మరియు యూరోపియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ ప్రకటించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ… తనకు ట్రంప్ కు మధ్య ఉన్న సంబంధం వాణిజ్య సంబంధం లాంటిదని పేర్కొన్నారు. చర్చలు చాలా సారవంతంగా జరిగాయని తెలిపారు. ఈ సమావేశం చాలా వివాదాలకు ముగింపు పలకడానికి తొలిమెట్టుగా ఆయన అభివర్ణించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ తో యుద్ధం వచ్చేది కాదని తెలిపారు. త్వరలోనే తాను ట్రంప్ మరోసారి మాస్కో వేదికగా భేటీ అవుతామని తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికా రష్యా మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →