BIKKI NEWS (MAR. 13) : Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
Today Top News In Telugu March 13th 2026
Today Telangana News
ఉచిత వైద్యం, జీవితం భీమా : తెలంగాణ ప్రజలందరికీ ఉచిత వైద్యం జీవిత బీమా కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం : వచ్చే విద్యా సంవత్సరం నుండి నర్సరీ నుండి ఇంటర్ వరకు పాఠశాల విద్య కిందకు తీస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
విద్యార్ధులకు రాయితీ రవాణా : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తి ఉచితంగా లేదా 50% రాయితీతో విద్యాసంస్థలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
తెలంగాణలో అధిక ద్రవ్యోల్బణం: ఫిబ్రవరి నెలకు గాను దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 5.02% ద్రవ్యోల్బణం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
అల్లు సినిమాస్: కోకాపేటలో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌తో కూడిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ హైకోర్టు: కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులరైజేషన్ విధానాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Today A.P. News
విశాఖపట్నం ‘బ్లూ ఎకానమీ’ హబ్: విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ మరియు మెరైన్ హబ్‌గా మార్చడానికి కేంద్రం ₹5,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఫిషింగ్ హార్బర్‌ను అత్యాధునికీకరించనున్నారు.
గ్యాస్ ధరల నియంత్రణ: రాష్ట్రంలో కమర్షియల్ గ్యాస్ కొరతను సాకుగా చూపి హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
తిరుమల అప్డేట్: గల్ఫ్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, శ్రీవారి భక్తుల రవాణా కోసం వినియోగించే ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచాలని టీటీడీ నిర్ణయించింది.
Today National News
భారత్ – ఇరాన్ చర్చలు: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. భారతీయుల భద్రత మరియు ఇంధన సరఫరాపై చర్చించారు
గ్యాస్ సంక్షోభం – కేంద్రం స్పష్టత: దేశంలో వంట గ్యాస్ (LPG) కొరత లేదని, కేవలం భయం (Panic) వల్ల జరుగుతున్న బుకింగ్‌లే సమస్యగా మారాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. హోర్డింగ్‌ను అరికట్టేందుకు 21 రోజుల నిబంధన తెచ్చినట్లు తెలిపారు.
ప్రధాని అస్సాం పర్యటన: పీఎం మోదీ నేడు (మార్చి 13) అస్సాంలో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
రాహుల్ గాంధీ – లోక్‌సభ: లోక్‌సభలో రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు.
వన్ నేషన్ – వన్ ఎలక్షన్: జమిలి ఎన్నికలపై రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర క్యాబినెట్ నేడు అధికారికంగా పరిశీలించనుంది. దీనిపై త్వరలోనే పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగవచ్చు.
IRCTC రామాయణ యాత్ర: ఐఆర్సీటీసీ త్వరలో ‘శ్రీ రామాయణ యాత్ర’ స్పెషల్ టూరిస్ట్ రైలును ప్రారంభించనుంది.
INTERNATIONAL NEWS
యుద్ధ ప్రభావం: ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.
యూరప్‌లో విద్యుత్ సంక్షోభం: పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు తమ అణు విద్యుత్ కేంద్రాలను తిరిగి ప్రారంభించే దిశగా ఆలోచిస్తున్నాయి.
స్పేస్ ఎక్స్ (SpaceX) రికార్డు: ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ నేడు ఒకే రాకెట్ ద్వారా 60 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
BUSINESS NEWS
మార్కెట్ అప్డేట్: యుద్ధ ప్రభావంతో సెన్సెక్స్ 1,000 పాయింట్లు పతనమవ్వగా, నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది.
బంగారం & వెండి: వెండి ధరలు కేజీకి రూ. 10,000 తగ్గి రూ. 2.80 లక్షల వద్దకు చేరగా, బంగారం ధర తులం రూ. 1.62 లక్షల వద్ద (24K) కొనసాగుతోంది
SPORTS NEWS
హాకీ: మహిళా హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ సెమీ ఫైనల్లో భారత్ నేడు ఇటలీతో తలపడనుంది.
Education and job updates
Inter Exams – నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ, కామర్స్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. నేటితో ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి
TGPSC OTR ఎడిట్: గ్రూప్-1 అభ్యర్థులు తమ OTR వివరాలను సరిచేసుకోవడానికి మార్చి 25 వరకు గడువు ఉంది.
టెన్త్ పరీక్షలు: రేపటి (మార్చి 14) నుండి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
AP DSC అప్డేట్: కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కసరత్తు తుది దశకు చేరుకుంది.
TG constable jobs – 17వేల పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి అనుమతి ఇవ్వాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది
CTET 2026 KEY సీటెట్ ప్రాథమిక కీ విడుదల
TG RJC CET 2026 నోటిఫికేషన్ విడుదల…. గురుకులాలు మరియు కేజీబీవీలలో ఇంటర్ అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.
Agniveer Navy 2027 నోటిఫికేషన్ విడుదల
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

