BIKKI NEWS (MAT.13) : Nursery to intermediate under school education says CM Revanth Reddy. నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించాలని కొత్త కాన్సెప్ట్‌తో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం తీసుకొస్తున్నాం. ఇప్పటివరకు 10 వ తరగతి తర్వాత ఇంటర్ విధానం కొనసాగుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12 వ తరగతి పాఠశాల విద్య కింద తీసుకొస్తున్నాం.
Nursery to intermediate under school education says CM Revanth Reddy.
విద్యార్థులకు పాఠశాలల్లో ఉదయం నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించాం. కార్పొరేట్ స్కూల్స్ తరహాలోనే విద్యార్థులకు ఉచితంగా లేదా 50 శాతం ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్ అర్బన్ రీజియన్‌లో నూతన విధానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం.
ఏఐ రావడం వల్ల టెక్నాలజీ రంగంలో వైట్ కాలర్ జాబ్స్‌కు ప్రత్యామ్నాయంగా మారొచ్చునేమో, కానీ బ్లూ కాలర్ జాబ్స్‌ని ఏఐ రిప్లేస్ చేయలేదు. స్కిల్స్ లేని కారణంగా ప్రతి ఏటా రాష్ట్రం నుంచి 1.10 లక్షల ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్లు ప్రపంచంతో పోటీ పడలేని పరిస్థితి.
అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాం. టాటా కన్సల్టెన్సీ సహకారంతో పురాతన ఐటీఐలను ఏటీసీ సెంటర్లుగా మార్చాం. తర్వాత దశలో పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఈ విధానంలోకి తెస్తాం.
విద్య ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు చేరినప్పటికీ నాణ్యమైన విద్య అందడం లేదు. యాంత్రికంగా సాగుతున్న విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టాం. నైపుణ్యత మెరుగుపర్చుకోకుంటే, ప్రపంచంతో పోటీ పడలేం. అందుకే విద్యా విధానంలో సంస్కరణలు చేపట్టాం. ఒక పాలసీ తీసుకొచ్చాం. విద్యతో పాటు స్కిల్స్ అవసరం.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
