హైదరాబాద్ (ఏప్రిల్ 09) : Telangana TET 2026 notification soon. తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేయడానికి అనుమతి కోరుతూ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
Telangana TET 2026 notification soon
ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా మొదటి విడత టెట్ నిర్వహణ కొరకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇన్ సర్వీస్ టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో… వేసవి సెలవుల్లోనే టెట్ నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.
ప్రాథమిక పంచనాల ప్రకారం ఈ వారంలోనే టెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది
