సర్పంచ్ పోటీకి అర్హతలు, అనర్హతలు

Sarpanch qualifications

BIKKI NEWS (OCT. 01) : Telangana sarpanch qualifications 2025. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో. సర్పంచ్ స్థానానికి పోటీ చేయడానికి అర్హతలు, అనర్హతలు ఇవ్వడం జరిగింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana sarpanch qualifications 2025.

అర్హతలు

1) సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి.

2) ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి.

3) సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

4) ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది.

5) మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.

అనర్హతలు

1) గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ పోటీకి అనర్హులు.

2) చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన ఉద్యోగులు పోటీకి అనర్హులు.

3) నేరానికి పాల్పడి శిక్ష పడిన వారు పోటీకి అనర్హులు.

4) నేర శిక్షను అనుభవించిన తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తి కాని వారు కూడా అనర్హులు.

5) మతిస్థిమితం లేని వారు.బదిరులు, మూగవారు అనర్హులు.

6) పౌరహక్కుల పరిరక్షణచట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు .

7) దివాళాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు.రుణ విమోచన పొందని దివాళాదారు కూడా పోటీకి అనర్హుడు.

8) గ్రామ పంచాయతీ కి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు.బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు పోటీకి అనర్హులు.

9) ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా దీనికి అనర్హులే.

10) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగుల తో పాటు స్థానిక సంస్థల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అవినీతికి కానీ విశ్వాస ఘాతుకానికి గానీ పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్లు పూర్తయ్యేంతవరకు సర్పంచ్ పోటీకి అనర్హులు.

11) గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా.. అనర్హులుగా గుర్తించబడతారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →