Telangana Ration card holders – 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ

Telangana ration card holders

BIKKI NEWS : Telangana Ration card holders. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు మరింత ప్రయోజనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను కూడా తక్కువ ధరలకు అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Ration card holders

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు మరిన్ని నిత్యావసర వస్తువులను అందించాలని భావిస్తోంది. తొలుత ఆరు రకాల సరుకులను పంపిణీ చేయాలని ఆలోచించినప్పటికీ, తాజాగా ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచినట్లు సమాచారం

కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు

తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించిన ప్రతిపాదనలను పౌరసరఫరాల శాఖ రాష్ట్ర మంత్రివర్గానికి పంపినట్లు సమాచారం. బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు ఈ సరుకులను అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

నేటి కేబినెట్ సమావేశంలో స్పష్టత వచ్చేనా?

నవంబర్ 5న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ నిర్ణయం తర్వాతే రేషన్ కార్డుదారులకు ఏయే సరుకులు పంపిణీ చేస్తారు? వాటి ధరలు ఎంత ఉంటాయి? ఎప్పటి నుంచి పంపిణీ ప్రారంభిస్తారు? అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ముఖ్య గమనిక: తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల పంపిణీపై ప్రస్తుతం ప్రతిపాదనల స్థాయిలోనే సమాచారం ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →