BIKKI NEWS :Telangana cabinet meeting on 5th November. తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 5వ తేదీన (గురువారం) తెలంగాణ మంత్రివర్గం 38వ సమావేశం నిర్వహించనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్ విభాగం) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana cabinet meeting on 5th November
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేరుతో నవంబర్ 4, 2026న జారీ చేసిన U.O. Note No.38/Cabinet/A2/2026-2 ప్రకారం.. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో 38వ మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శాఖల వారీగా అజెండా అంశాల సమర్పణకు ఆదేశాలు
కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి అన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
- మంత్రిమండలి పరిశీలనకు సంబంధించిన అజెండా అంశాలను ముందుగా సర్క్యులేషన్ ద్వారా ఆమోదించాలి.
- ఆమోదించిన అజెండా అంశాలతో పాటు వాటి తెలుగు అనువాదాన్ని కూడా సమర్పించాలి.
- నవంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్ విభాగం)కు పంపించాలి.
- ఎలాంటి అజెండా అంశాలు లేకపోతే NIL నివేదిక సమర్పించాలని సూచించారు.
అధికారులకు కీలక సూచనలు
నవంబర్ 5న జరిగే కేబినెట్ సమావేశం సమయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులందరూ ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్ విభాగం, ఉద్యానవన శాఖ, TGTS తదితర సంబంధిత విభాగాలకు కూడా సూచనలు జారీ చేశారు.
కేబినెట్ సమావేశంపై ఆసక్తి
- ఎల్‌నినో ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ధరల పెరుగుదల నియంత్రణ
- అమలు అవుతున్న సంక్షేమ పథకాల పురోగతి,
- కొత్త ప్రాజెక్టులు,
- ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల భర్తీ,
- ఉద్యోగ నియామకాలు,
- పలు శాఖ పనితీరు,
- రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా తీసుకోవాల్సిన చర్యలు
- పారిశ్రామిక ప్రాజెక్టులకు కూడా భూకేటాయింపులు,
- కొత్త పరిశ్రమలకు అనుమతులు
వంటి అంశాలు పై చర్చించే అవకాశం ఉంది.

