CM review meeting on education department 2026 – కీలక ఆదేశాలు జారీ

Cm review meeting on education department 2026

BIKKI NEWS : CM review meeting on education department 2026. ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో వివిధ శాఖ‌ల ప‌రిధిలోని ప్ర‌భుత్వ వ‌స‌తిగృహాలు, రెసిడెన్షియ‌ల్ స్కూళ్లు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు యూనిఫాంలు, కిట్ల పంపిణీపై స‌మీక్షించారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

CM review meeting on education department 2026

విద్యార్థుల‌కు అందించిన స్కూల్ యూనిఫాంలపై పిల్లల నుంచి అభిప్రాయాలు (ఫీడ్‌బ్యాక్‌) సేక‌రించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల నుంచి అభిప్రాయాలు (Feedback) సేక‌రించడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగులు, డిజైన్ల‌కు ప్రాధాన్య‌మివ్వ‌చ్చ‌ని చెప్పారు.

గ‌తంతో పోలిస్తే ఎంతో నాణ్య‌మైన యూనిఫాంలు, ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగులు, డిజైన్ల‌తో అంద‌జేశామని తెలిపారు. యూనిఫాంల‌తో పాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, క‌టోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్త‌యింద‌ని సమావేశంలో అధికారులు తెలియ‌జేశారు.

ఒక‌ట్రెండు సంస్థ‌ల ప‌రిధిలో కొన్ని వ‌స్తువుల పంపిణీ 95 శాతం వ‌ర‌కు పూర్త‌యింద‌ని వివరించగా, ఆ వ‌స్తువుల పంపిణీని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి గారు ఆదేశించారు.

వ‌చ్చే ఏడాదికి విద్యార్థుల‌కు అంద‌జేసే యూనిఫాంలు, ఇత‌ర సామ‌గ్రికి సంబంధించి విధివిధానాల‌ను (ఎస్‌వోపీ) ఇప్పుడే రూపొందించాల‌ని స్పష్టం చేశారు.

విద్యార్థుల‌కు అంద‌జేసే వ‌స్తువుల జాబితా రూప‌క‌ల్ప‌న‌ నుంచి, టెండ‌ర్లు, స‌ర‌ఫ‌రా, అంద‌జేత వ‌ర‌కు ప్ర‌తిదీ నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి చేయాలని చెప్పారు. పాఠ‌శాల‌లు తెరిచిన రోజునే మొత్తం వ‌స్తువులు అందేలా ఇప్ప‌టినుంచే కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు.

ఈ స‌మీక్ష‌లో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌ శ్రీ‌ధ‌ర్‌ గారు, సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌బ్య‌సాచి ఘోష్‌ గారు, రాష్ట్ర గిరిజ‌న‌, వెనుక‌బ‌డిన త‌ర‌గతుల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ రాహుల్ బొజ్జా గారు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →