SEC – స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హతల నిబంధనలు విడుదల

BIKKI NEWS (OCT. 04) : Telangana local body elections qualifications by SEC. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన అర్హతలు విషయంలో కీలక నిబంధనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Telangana local body elections qualifications by SEC

నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి .

పోటీచేసే గ్రామం, ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటు కలిగి ఉండాలి .

గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులు.

శాసనసభ లేదా పార్లమెంటు చేసిన చట్టం కింద ఏర్పాటయ్యే సంస్థలోని ప్రతినిధి పోటీ చేయడానికి అర్హుడు కాదు.

మతిస్థిమితం లేనివారు, పూర్తిస్థాయి బధిరులు అనర్హులు.

మతసంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు.

సింగరేణి, ఆర్టీసీలలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు. రేషన్ డీలర్లూ పోటీ చేయవచ్చు.

క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి.. శిక్ష విధించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు.

పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీకి అనర్హులు.

పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసు కున్నా(గుత్తేదారులు) పోటీకి అర్హత ఉండదు.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK