Special TG TET 2026 – ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ నోటిఫికేషన్

Special tg tet 2026-ii for inservice teachers

BIKKI NEWS : Special TG TET 2026-II for inservice Teachers. తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న Special TG TET 2026-II పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 2026 అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కాగా, అక్టోబర్ 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షలు నవంబర్ 16 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Special TG TET 2026-II for inservice Teachers

అంశంతేదీ
నోటిఫికేషన్ విడుదల01-10-2026
ఇన్ఫర్మేషన్ బులెటిన్/వివరణాత్మక నోటిఫికేషన్07-10-2026 నుంచి
ఫీజు చెల్లింపు07-10-2026 నుంచి 16-10-2026 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ07-10-2026 నుంచి 16-10-2026 వరకు
హాల్ టికెట్ల డౌన్‌లోడ్09-11-2026 నుంచి
పరీక్ష తేదీలు16-11-2026 నుంచి 21-11-2026 వరకు
ఫలితాల ప్రకటన09-12-2026 నుంచి 11-12-2026 మధ్య

అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు

Special TG TET 2026-II కోసం అభ్యర్థులు 2026 అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి.

నవంబర్ 16 నుంచి TG TET పరీక్షలు

Special TG TET 2026-II పరీక్షలను నవంబర్ 16 నుంచి నవంబర్ 21, 2026 వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి.

  • ఉదయం సెషన్: 9:00 AM – 11:30 AM
  • మధ్యాహ్నం సెషన్: 2:00 PM – 4:30 PM

నవంబర్ 9 నుంచి హాల్ టికెట్లు

పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్ 9, 2026 నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వంటి వివరాలను ముందుగానే పరిశీలించాలి.

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

డిసెంబర్‌లో TG TET ఫలితాలు

Special TG TET 2026-II ఫలితాలను డిసెంబర్ 9 నుంచి 11, 2026 మధ్య ప్రకటించనున్నట్లు షెడ్యూల్‌లో వెల్లడించారు.

TG TET అధికారిక వెబ్‌సైట్:

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →