BIKKI NEWS (OCT. 01) : Wanaparthy NHM Recruitment 2026. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వనపర్తి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం (DM&HO Wanaparthy) నుంచి జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 27 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
Wanaparthy NHM Recruitment 2026
ఈ నోటిఫికేషన్ ద్వారా శిశు ఆరోగ్యం-SNCU, ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్ హాస్పిటల్, మాతా ఆరోగ్యం-CEMONC, మాతా ఆరోగ్యం-HDU & OICU, మాతా ఆరోగ్య కేంద్రాలు, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ-HWC/పల్లె దవాఖాన, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్యాలియేటివ్ కేర్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, RBSK తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వారీగా ఖాళీలు
| పోస్టు | ఖాళీలు |
|---|---|
| పీడియాట్రీషియన్ / మెడికల్ ఆఫీసర్ – SNCU | 03 |
| స్టాఫ్ నర్స్ – SNCU | 03 |
| ANM – ఇన్‌ఫెక్షన్ హాస్పిటల్ | 02 |
| స్టాఫ్ నర్స్ – CEMONC | 01 |
| ల్యాబ్ టెక్నీషియన్ – HDU & OICU | 01 |
| స్టాఫ్ నర్స్ – HDU & OICU | 02 |
| అనస్థీషియస్ట్ | 01 |
| OBG స్పెషలిస్ట్ | 01 |
| స్టాఫ్ నర్స్ – మాతా ఆరోగ్య కేంద్రాలు | 03 |
| MLHP / CHO / MO – HWC / పల్లె దవాఖాన | 06 |
| ఫిజీషియన్ / MBBS / MD – ప్యాలియేటివ్ కేర్ | 01 |
| ల్యాబ్ టెక్నీషియన్ – అర్బన్ హెల్త్ మిషన్ | 02 |
| ANM – RBSK మొబైల్ హెల్త్ టీమ్ | 01 |
| మొత్తం | 27 |
విద్యార్హతలు
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. పీడియాట్రిషియన్, OBG స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు MBBSతో పాటు సంబంధిత MD/MS/DNB/PG డిప్లొమా వంటి అర్హతలు అవసరం. స్టాఫ్ నర్స్ పోస్టులకు GNM/B.Sc Nursing, అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం.
ANM పోస్టులకు ANM/MPHW (Female)తో పాటు తెలంగాణ నర్సింగ్/సంబంధిత కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు DMLT/B.Sc MLTతో పాటు సంబంధిత రిజిస్ట్రేషన్ కోరారు. MLHP/CHO/MO పోస్టులకు పోస్టును బట్టి BAMS, B.Sc Nursing, B.Sc Community Health లేదా MBBS వంటి అర్హతలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 01-07-2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హత పరీక్ష/విద్యార్హతలకు 90 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు.
దరఖాస్తు ఫీజు
అభ్యర్థులు దరఖాస్తు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో చెల్లించాలి.
- OC/BC: ₹300
- SC/ST: ₹200
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ తేదీ: 28-09-2026
- నోటిఫికేషన్ జారీ: 29-09-2026
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 30-09-2026
- దరఖాస్తులకు చివరి తేదీ: 09-10-2026
పూర్తి చేసిన దరఖాస్తును స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సంబంధిత జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO), వనపర్తి జిల్లా కార్యాలయానికి సమర్పించాలి.
ముఖ్య గమనిక: పోస్టును బట్టి విద్యార్హతలు, రిజిస్ట్రేషన్, అనుభవం తదితర నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించాలి.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

