BIKKI NEWS : Satavahana University Part Time Faculty jobs 2026: తెలంగాణలోని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ నుంచి నిరుద్యోగ అభ్యర్థులకు కీలక ప్రకటన వెలువడింది. యూనివర్సిటీలోని వివిధ కోర్సులకు పార్ట్ టైమ్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
Satavahana University Part Time Faculty jobs 2026
- యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ
- ప్రాంతం: కరీంనగర్, తెలంగాణ
- నోటిఫికేషన్ నంబర్: 1058/SU/KNR/2026-27
- నోటిఫికేషన్ తేదీ: 24 అక్టోబర్ 2026
- దరఖాస్తు గడువు : 31 అక్టోబర్ 2026
- పోస్టుల పేరు: పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ
- దరఖాస్తు విధానం: అధికారిక నోటిఫికేషన్ ప్రకారం
- అధికారిక వెబ్సైట్: www.satavahana.ac.in
ఏ కోర్సులకు ఫ్యాకల్టీ పోస్టులు?
శాతవాహన యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కింది కోర్సులకు పార్ట్ టైమ్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు.
- ఎం.కాం (ఫైనాన్షియల్ టెక్నాలజీ) – 2
- మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW) – 2
- ఎంఎస్సీ (ఫుడ్ సైన్స్ టెక్నాలజీ) – 2
- ఎంఎస్సీ (ఫోరెన్సిక్ సైన్స్) – 3
ఈ కోర్సులకు సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు ఏమిటి?
- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- NET / SET/ SLET / PhD కలిగి ఉండాలి.
- బోధనా అనుభవం, పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది
ఎంపిక విధానం
- విద్యా అర్హతలు
- డెమో & ఇంటర్వ్యూ
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ధరఖాస్తు ఫారం, బయో డేటా ఫారం నింపి ప్రత్యక్షంగా అక్టోబర్ 31 లోపు కింద ఇవ్వబడిన చిరునామాలో సమర్పించాలి.
పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారం పీడీఎఫ్
చిరునామా
- The Registrar
- Satavahana University
- Malkapur Road, chintha kunta
- Karimnagar – 505002
- Telangana
అధికారిక వెబ్సైట్: https://www.satavahana.ac.in/

