BIKKI NEWS (DEC. 26) : RYTHU BHAROSA SCHEME NOT CANCELLED. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక రైతు పథకం రైతు భరోసా రద్దు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.
RYTHU BHAROSA SCHEME NOT CANCELLED
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన TELANGANA FACT CHECK ఈ వార్తలను ఖండించింది.
నిజమైన లబ్దిదారులకు మాత్రమే లబ్ది చేకూరేలా క్షేత్ర స్థాయిలో విచారం జరుగుతుందని స్పష్టం చేసింది.
అయితే తాజాగా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాగు భూములకే రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేస్తామని ఇందుకోసం శాటిలైట్ చిత్రాలను క్రోడీకరించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో రైతు భరోసా యాసంగి సీజన్ కు సంబంధించి నిధులు విడుదల పై సందిగ్ధం నెలకొంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.

