RYTHU BHAROSA – సాగు భూములకే రైతు భరోసా

Rythu Bharosa only for cultivation lands

BIKKI NEWS (DEC. 25) : Rythu Bharosa only for cultivation lands. యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని సాగు భూములకు మాత్రమే వర్తింప చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Rythu Bharosa only for cultivation lands

ఈ మేరకు శాటిలైట్ చిత్రాలను క్రోడీకరించి త్వరగా నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సాటిలైట్ చిత్రాల నివేదిక ఆధారంగానే రచన ఖాతాల్లోకి రైతు భరోసా నగదును జమ చేస్తామని స్పష్టం చేశారు

జనవరి నెలలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.

ఈ పథకం ద్వారా రాయితీతో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు లభ్యమవుతాయని తెలిపారు. దీనికోసం రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని కూడా అధికారులను ఆదేశించారు.

ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో ప్రారంభించిన యూరియా యాప్ విజయవంతంగా నడుస్తుందని యాప్ ద్వారానే కొనుగోలు చేయడానికి రైతులు సిద్ధంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK