Requesting for vocational camp schedule change. - bikki news

Vocational camp – హైదరాబాద్ ఒకేషనల్ క్యాంపు షెడ్యూల్ మార్చాలి

  • ఇంటర్ బోర్డు సెక్రటరీ గారికి,TGJLA_475 ASSN విజ్ఞప్తి

BIKKI NEWS (Mar. 10) : Requesting for Vocational camp schedule change. ఈనెల 19 మరియు 21వ తేదీల్లో ఉగాది పర్వదినము మరియు రంజాన్ పండుగ దృష్ట్యా హైదరాబాదు నాంపల్లి ఎంఏఎం కళాశాలలోని 18న ప్రారంభమయ్యే ఒకేషనల్ సెకండ్ స్పెల్ మూల్యాంకం డేట్ ను 22 కు మార్చవలసిందిగా తెలంగాణ ఇంటర్ విద్య డైరెక్టర్ మరియు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రీ కృష్ణ ఆదిత్య I.A.S గారికి ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్ మరియు డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

Requesting for Vocational camp schedule change.

ఈ సంవత్సరం ఒకేషనల్ పరీక్ష పేపర్ల మూల్యాంకన క్యాంపును రాష్ట్రవ్యాప్తంగా ఒక హైదరాబాదులోనే ఏర్పాటు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకన విధులలో పాల్గొనే 33 జిల్లాల ఒకేషనల్ అధ్యాపకులు హైదరాబాద్ రావాల్సి ఉంటుందని తెలుపుతూ, సెకండ్ స్పెల్ ఈనెల 18న నాంపల్లిలోని M.A.M జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దానిని 22 కు వాయిదా వేయాలని విన్నవించారు ‌

అధ్యాపకులు ఉగాది మరియు రంజాన్ పండగలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవడానికి ఇంటికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుందని, దూరం నుంచి వచ్చే ఒకేషనల్ అధ్యాపకులకు ఇబ్బంది కలగకుండా ఈ విషయాన్ని పరిశీలించి వాయిదా వేయవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ఇట్టి విషయాన్ని ఇంటర్ బోర్డు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీమతి జయప్రద భాయ్ మేడం గారికి కూడా విప్నవించిన్నట్లు తెలిపారు.

గౌరవ ఇంటర్ విద్య బోర్డు సెక్రటరీ గారు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు‌

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →