BIKKI NEWS (MAR. 28) ; RCB VS SRH – RCB WON AGAINST SRH IN IPL 1st MATCH. ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ పై సునాయాస విజయాన్ని సాధించింది. భారీ స్కోరును సైతం అవలీలగా చేదించి ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించింది.
RCB VS SRH – RCB WON AGAINST SRH
టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ వర్మ త్వరగానే అవుట్ అయినప్పటికీ, కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కిషన్ కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఆర్సీబీ బౌలర్లలో డెబ్యూ ప్లేయర్ జేకబ్ డఫీ అద్భుతంగా రాణించి 3 వికెట్లు పడగొట్టాడు. రొమారియో షెపర్డ్ కూడా 3 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు
కోహ్లీ చివరి వరకు
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, మొత్తం 26 బంతుల్లో 61 పరుగులు (7 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పాడు.
మరోవైపు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన క్లాస్ ఆటతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ (69*) మరియు కెప్టెన్ రజత్ పాటిదార్ (31) కలిసి సునాయాసంగా టార్గెట్ ను 15. 4 ఓవర్ లలోనే చేధించారు.

