BIKKI NEWS (OCT. 06) : PEN number on intermediate memos. తెలంగాణ ఇంటర్మీడియట్ మార్కుల సర్టిఫికెట్లపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు (PEN)ను వచ్చే మార్చిలో పరీక్షలు రాసే విద్యార్థుల ధ్రువపత్రాలపై ముద్రించనున్నారు.
PEN number on intermediate memos
ఇంటర్ తర్వాత ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారా.. ? లేదా..? తెలుసుకునేందుకు ప్రస్తుతం ట్రాకింగ్ విధానం లేదు. ఇక నుంచి విద్యార్థులు చదువు మానేసినా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకుంటున్నా… ‘పెన్’తో ఇట్టే తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం పాఠశాలల్లోనే ఈ నంబరు యూడైజ్ పోర్టల్ ద్వారా ప్రతి విద్యార్థికి ఇస్తున్నారు. పదో తరగతి మార్కుల మెమోలపై 2024 నుంచి ‘పెన్’ను ముద్రిస్తున్న విషయం తెలిసిందే.
దాన్ని ‘సమగ్ర శిక్షా’ నుంచి ఇంటర్ బోర్డు తీసుకుంటోంది కానీ, ఇంటర్ ధ్రువపత్రాలపై ముద్రించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు సుమారు 9.75 లక్షల మంది ఉన్నారు. వారి ధ్రువపత్రాలపై ‘పెన్ ను ముద్రించనున్నామని బోర్డు కార్య దర్శి అభిలాష అభినవ్ చెప్పారు.
డిజి లాకర్ తో ఒప్పందం..
అగ్ని ప్రమాదాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విద్యార్థుల సర్టిఫికెట్లు చేజారిపోకుండా దేశవ్యాప్తంగా ఆయా ధ్రువపత్రాలను డిజి లాకర్లో భద్రపరచుకొనే సౌకర్యం ఉంది. అందుకే అపార్ పేరిట విద్యార్థులకు 12 అంకెల గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. సొంతగానే దాన్ని అపార్ పోర్టల్ ద్వారా పొందొచ్చు. దీనికి తప్పనిసరిగా ఆధార్ నంబరు ఉండాలి. విద్యాసంస్థల ద్వారా పొందాలంటే ఆధార్ సంఖ్య ఇవ్వడమే కాకుండా తల్లి దండ్రుల అంగీకారం అవసరం.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
అపార్ ఐడీ ఉంటేనే తమ సర్టిఫికెట్లను డిజి లాకర్లో భద్రపరచుకునేందుకు వీలవుతుంది. డిజి లాకర్ ఏజెన్సీతో ఇంటర్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుందని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ చెప్పారు.
ప్రస్తుతం 82-85 శాతం ఇంటర్ విద్యార్థులకు అపార్ ఐడీ ఉందని.. మిగిలిన వారికి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.

