BIKKI NEWS : Part Time Lecturers Service. పార్ట్ టైం / టైం స్కేల్ లెక్చరర్ల సర్వీసుల క్రమబద్ధీకరణకు సంబంధించి సర్వీస్ కాలానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తమ సర్వీస్ ను క్రమబద్ధీకరణ తేదీ నుంచి కాకుండా సదరు పోస్టు ఖాళీ ఏర్పడిన నాటి నుంచి గుర్తించాలని పార్ట్ టైం లెక్చరర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
Part Time Lecturers Service Case
1987–92 మధ్యకాలంలో జూనియర్ కాలేజీల్లో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ లెక్చరర్లుగా కొందరు నియమితులయ్యారు. అనంతరం 2016లో రాష్ట్ర ప్రభుత్వం వీరి సర్వీసుల క్రమబద్ధీకరణకు సంబంధించి జీఓ నంబర్ 16ను జారీ చేసినట్లు పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే 1994లో జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 212 కింద కొందరు లెక్చరర్ల సేవలను క్రమబద్ధీకరించినప్పటికీ, తమ విషయంలో మాత్రం అదే విధంగా న్యాయం జరగలేదని వారు వాదించారు. తమను కూడా రెగ్యులర్ చేయాలని పోస్ట్ ఏర్పడిన నాట్ నుంచి సర్వీస్ను కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
హైకోర్ట్ లో అనుకూలం
ఇదే అంశంపై గతంలో ఈ 26 మంది పార్ట్ టైం / టైం స్కేల్ లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించగా సర్వీస్ ఏర్పడినప్పటి నుంచి లేదా సర్వీస్ ఐదేళ్ల పూర్తి చేసుకున్న కాలం నుండి వీరి సర్వీస్ను క్రమబద్ధీకరించాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెయించును ఆశ్రయించింది డివిజన్ బెంజ్ వారి సర్వీస్ ను గుర్తించడం వీలుకాదని తీర్పు చెప్పింది . ఈ నేపథ్యంలో లెక్చరర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన లెక్చరర్లు
తమకు కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా సర్వీసుల క్రమబద్ధీకరణ ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ లెక్చరర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా తమకు న్యాయం చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.
Part Time Lecturers Service Case – పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు లెక్చరర్ల వాదనలను పరిశీలించింది. అనంతరం వారి పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పార్ట్‌టైమ్ లెక్చరర్ల సర్వీసుల క్రమబద్ధీకరణకు సంబంధించి వారు చేసిన న్యాయపోరాటానికి ఎదురుదెబ్బ తగిలింది.

