Today in history November 4th – చరిత్రలో ఈరోజు నవంబర్ 04

Today in history

BIKKI NEWS : Today in history November 4th – చరిత్రలో ఈరోజు నవంబర్ 04

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history November 4th

సంఘటనలు

1869: నేచర్ (పత్రిక) అనేది ఒక బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది.
2004: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సుశీల్‌ కుమార్‌ షిండే నియమితుడయ్యాడు.
1947: భారతదేశపు మొట్టమొదటి పరమ వీరచక్ర పురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు.
1979: ఇరాన్ బందీల కల్లోలం మొదలైంది. ఇరాన్‌లోని అతివాదులు అమెరికా రాయబార కార్యాలయం మీద దాడి చేసి, 63 మంది అమెరికనులతో సహా 90 మందిని బందీలుగా పట్టుకున్నారు.

జననాలు

1845: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1883)
1889: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1942)
1922: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (మ.1996)
1925: రిత్విక్ ఘటక్, ఒక బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత, స్క్రిప్టు రచయిత (మ.1976).
1929: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్ 203) (మ.2013).
1931: ముక్తి ప్రసాద్ గొగోయ్, అస్సాంకు చెందిన ప్రసూతి వైద్యుడు, రచయిత. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2021)
1932: వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)
1944: పద్మావతి బందోపాధ్యాయ, భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ.
1964: జొన్నలగడ్డ శ్రీనివాస రావు , తెలుగుచలనచిత్ర దర్శకుడు , నిర్మాత .
1971: టాబు , భారతీయ సినీ నటీ .

మరణాలు

1980: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (జ.1923)
2000: నాగేంద్ర,(రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం) సంగీత దర్శకులు (జ.1935)
2007: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (జ.1926)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →