జీజేసీ హయత్ నగర్ లో ఘనంగా పేరెంట్ టీచర్ మీటింగ్

జీజేసీ హయత్ నగర్ లో ఘనంగా పేరెంట్ టీచర్ మీటింగ్ - bikki news
  • BIKKI NEWS : 23-01-2026

PARENT TEACHER MEETING IN GJC HAYATH NAGAR. ప్రభుత్వ జూనియర్ కళాశాల హయత్ నగర్ లో ఇంటర్మీడియట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ యన్. సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రెండో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించడం జరిగింది.

PARENT TEACHER MEETING IN GJC HAYATH NAGAR

మెగా పేరేంట్ టీచర్ మీటింగ్ కు భారీగా తల్లిదండ్రులు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యన్. సంజీవరెడ్డి మాట్లాడుతూ… పరీక్షల సమయం కారణంగా విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించి ఎక్కువ సమయం చదువుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు.

విద్యార్థులను సెల్ ఫోన్లు, టీవీల నుండి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులను కోరారు. తద్వారా విద్యార్థుల మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే పేరెంట్స్ ఇచ్చిన సలహాలు, సూచనలను భవిష్యత్తులో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుత విద్యార్థులకు ఇన్సిపిరేషన్ కల్పించడానికి పూర్వ విద్యార్థుల సక్సెస్ స్టోరీస్ లో భాగంగా వాల్ ఆఫ్ ఫేమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →